Lokesh: అధికారం ఉన్నా, లేకున్నా జగన్ ప్రజలకు దూరంగానే ఉన్నారు...! 1 y ago
AP : జగన్ వాస్తవాలు తెలుసుకోవాలన్నారు మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65 శాతానికి పైగా ఓట్లతో గెలిచామని చెప్పారు. ఎన్నిక ఏదైనా గెలుపు కూటమిదే అన్నారు. జగన్ ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. గత ప్రభుత్వం అనేక అరాచకాలు చేసిందన్నారు. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసేశారని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు.
అధికారం ఉన్నా, కోల్పోయినా ప్రజలకు జగన్ దూరంగానే ఉన్నారన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ప్రజలే నిర్ణయించారన్నారు. ఆ విషయం జగన్కు అర్థం కావడం లేదన్నారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా గురించి సీఎంను కించపరిచేలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. వైసీపీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయో ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదన్నారు.
వైసీపీ పాలనలో అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. సీఎం, డిప్యూటీ సీఎంపై జగన్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. రాష్ట్రానికి రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు.